హాలీవుడ్ స్టార్ హేమ్స్‌వర్త్ కూతురికి ఇండియా అని ఎందుకు పేరుపెట్టాడో తెలుసా?

సినిమా షూటింగ్ కోసం ఇండియా వచ్చిన హేమ్స్‌వర్త్ కు రిలేషన్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇండియాతో తనకున్న సంబంధంతోనే ఆస్ట్రేలియన్ యాక్టర్ అలా పేరు పెట్టుకున్నాడు. మరి అలా పెట్టుకోవడం వెనుక కారణం.. ఆగష్టు 11న 37వ వసంతంలోకి అడుగుపెట్టిన క్రిస్ హేమ్స్‌వర్త్ మోడల్ కమ్ యాక్టర్ ఎల్సా పటాకీని పెళ్లాడి చాలా కాలం ఇండియాలోనే గడిపారు.
2019లో రిలీజ్ అయిన Men in Black: International ఇక్కడే ప్రమోషన్స్ చేశారు. ‘నా భార్య చాలాకాలం ఇండియాలోనే గడిపింది. అందుకే ఆ పేరు పెట్టాం’ అని అంటున్నాడు హేమ్స్‌వర్త్. ఈ కపుల్ కు ఇండియా రోజ్ ఒక్కత్తే కాదు.. సాషా, ట్రిష్టన్ అనే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ యాక్టర్ పలు సందర్భాల్లో ఇండియా గురించి మాట్లాడాడు. అహ్మదాబాద్, ముంబై ప్రాంతాల్లో EXTRACTION షూటింగ్ సమయంలోనూ ఇండియాలోనే గడిపాడు.
‘నాకు ఆ ప్లేస్, ప్రజలు చాలా ఇష్టం’ అని ఓ ప్రెస్ ఈవెంట్లోనూ చెప్పాడు. ‘అక్కడ షూటింగ్ జరుగుతుంటే వేల మంది జనం వీధుల్లో ప్రతిరోజు కనిపిస్తుండేవారు. అలా నేనెప్పుడూ చూడలేదు. అంత మంది ప్రజలనుచూస్తుంటే నాకు ఎగ్జైటింగ్ గా అనిపించేది’
‘అక్కడి ప్రజలు వారితో ఇంటరాక్షన్ నాకు పాజిటివ్ ఫీలింగ్ తీసుకువచ్చేవి. అక్కడ షూటింగ్ చేయడం మంచి ఎగ్జైటింగ్ గా అనిపించేది. అంతకుముందు ఎప్పుడూ ఇలాంటి షూట్ చేయలేదు. ఇండియాలో మార్వెల్ క్యారెక్టర్ థార్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. డైరక్టర్స్ జోయ్, ఆంటోనీ రస్సో అవెంజర్స్: ఎండ్‌గేమ్ షూటింగ్ చేసే సమయంలో ఇండియన్ ఫ్యాన్స్ చీరింగ్ వీడియోలు చూసి ఇన్ స్పైర్ అయ్యేవారట.