Hyderabad: భారీగా చైనా మాంజా స్వాధీనం.. 18 మందిపై కేసులు.. మీరూ కొంటున్నారా?
చైనా మాంజాను ఎవరు అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

China Manja
చైనా మాంజా అమ్మొద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ చాలామంది వ్యాపారులు ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇటీవల మాంజాల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా అమ్ముతున్న దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
భారీగా చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 18 మందిపై కేసులు నమోదు చేశారు. చైనా మాంజాను వ్యాపారులు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. గత మూడు రోజుల నుంచి వరుసగా సోదాలు చేస్తున్నామమని పోలీసులు తెలిపారు.
చైనా మాంజాను ఎవరు అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి వేళ పతంగులు, మాంజాల దుకాణాలకు గిరాకీ బాగా పెరిగింది. చైనా మాంజా వల్ల చాలా ప్రమాదం ఉంటుందని కొన్నేళ్ల క్రితమే దాన్ని నిషేధించారు. అయినప్పటికీ వ్యాపారులు డబ్బు సంపాదనే లక్ష్యంగా జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సంక్రాంతి సమయంలో పోలీసులకు ప్రతి ఏడాది భారీ ఎత్తున చైనా మాంజా పట్టుబడుతోంది.
Guntur Kaaram : గుంటూరు కారం టీం సైబర్ క్రైమ్ కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?