Punjab: ఇటువంటి క్రియేటివ్‌ ఐడియాలు తనకే వస్తాయనుకున్న యువతికి షాక్ ఇచ్చిన పోలీసులు

వెరైటీగా వీడియో తీసుకుంటుండడంతో ఈ దెబ్బకు సోషల్ మీడియా స్టార్ అయిపోతానని ఆ యువతి ఉప్పొంగిపోయింది.

Punjab: ఇటువంటి క్రియేటివ్‌ ఐడియాలు తనకే వస్తాయనుకున్న యువతికి షాక్ ఇచ్చిన పోలీసులు

Viral Video

Viral Video – Punjab woman: రోడ్డుపై కారు వెళ్తుండగా బానెట్‌పై కూర్చుని వీడియో తీసుకుంది 25 ఏళ్ల ఓ యువతి. ఇది ఎవరికీ రాని అద్భుతమైన ఐడియా అని అనుకుందేమో. ఇంత వెరైటీగా, క్రియేటివ్‌గా వీడియో తీసుకునే ఆలోచన తనలాంటి తెలివైన వారికే వస్తుందనుకున్నట్టుంది.

ఒకరు కారు నడుపుతుండగా, మరొకరు ఆమె వీడియో తీశారు. వెరైటీగా వీడియో తీసుకుంటుండడంతో ఈ దెబ్బకు సోషల్ మీడియా స్టార్ అయిపోతానని ఆ యువతి ఉప్పొంగిపోయింది. అనుకున్నట్లుగానే సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది. అయితే, కథ అడ్డం తిరిగింది.

ఆ కారు నంబరు ఆధారంగా యజమానిని గుర్తించిన పోలీసులు మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ కారుని సీజ్ చేశారు. ఆ యువతి జలంధర్-జమ్ము జాతీయ రహదారిపై చోటుచేసుకుందని వివరించారు. వీడియో తీసుకున్న యువతితో పాటు ఉన్న వారికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఆ యువతి పంజాబ్ కు చెందిన అమ్మాయని తెలిపారు.

Tomato Prices : కిలో టమాటాలు రూ.80లకే విక్రయిస్తున్న రైతు సోదరులు ..