Kanipakam Vinayaka Kshetra : స్వయంభువు వరసిద్ధి వినాయక క్షేత్రం కాణిపాకం

తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పోప్పుకుంటారని ప్రసిద్ది. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.

Kanipakam Vinayaka Kshetra : స్వయంభువు వరసిద్ధి వినాయక క్షేత్రం కాణిపాకం

Kanipakam Vinayaka

Updated On : August 26, 2022 / 12:58 PM IST

Kanipakam Vinayaka Kshetra : శుభకార్యం జరిపించాలంటే మొదటిగా పూజించేది వినాయకుడినే. వినాయకుడికి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. అలాంటి వినాయకుడు కొలువైన ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం భాసిల్లుతుంది. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కాణిపాకం వినాయకుడిని దర్శించుకుంటారు. ఇక్కడి ఆలయంలో వినాయకుడు స్వయంభువుగా కొలువై ఉన్నాడు. వేల సంవత్సరాల నాటి చరిత్ర ఈ కాణిపాకం ఆలయానికి ఉంది.

ఆలయ చరిత్రను పరిశీలిస్తే కాణిపాకం గుడి వున్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వ్యవసాయ భూమిలో నీటి సౌకర్యాన్ని ఇచ్చే బావి కొంతకాలానికి ఎండిపోయింది. నీటికోసం బావి పూడిక తీయాలని అన్నదమ్ములు నిర్ణయించుకుని తవ్వటం ప్రారంభించారు. ఈక్రమంలో తవ్వకాల్లో వారికి ఒక రాయి తగిలింది. అంతలోనే బావిలో నుండి రక్తపు ఊరటాన్ని వారు గమనించారు.

ఏంజరిగిందో నన్న ఆందోళనతో అక్కడ బయటపడ్డ రాయిని గమనించారు. అది వినాయకుని విగ్రహం కావటంతో పూజలు ప్రారంభించారు. వారికి ఉన్న శారీరక లోపాలు తొలగిపోయాయి. ఈ విషయాన్ని ఆనోటాఆనోటా విన్న భక్తలు చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని విగ్రహానికి కొబ్బరి కాయలు కొట్టటం ప్రారంభించారు. భక్తలు కొట్టిన కొబ్బరి కాయల నీరు వ్యవసాయ భూమి మొత్తం ప్రవహించటం ప్రారంభమైంది. వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరును కాణిపరకం అంత విస్తీర్ణం పాకిపోయింది. కాణిపరకం అనే తమిళ పదం తరువాత వాడుకలో కాణిపాకంగా మారిపోయింది.

తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే తప్పోప్పుకుంటారని ప్రసిద్ది. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తారని అక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్ధంగా అందిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు. వరసిద్ది వినాయకుని ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు, ఒక మండపం ఉన్నాయి. శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం వుంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి.