Viral Video: ఈ బాలిక ఫిట్‌నెస్ వీడియో చూసి ‘అదరహో’ అంటున్న నెటిజన్లు

ఆ బాలిక పేరు పూజా బిష్ణోయి. వయసు 11 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే అథ్లెట్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. కొత్త ఏడాది తాము ఫిట్ నెస్ సంపాదించుకోవడానికి ఆ బాలిక వీడియో స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. 

Viral Video: ఈ బాలిక ఫిట్‌నెస్ వీడియో చూసి ‘అదరహో’ అంటున్న నెటిజన్లు

Viral Video

Updated On : December 31, 2022 / 9:15 PM IST

Viral Video: ఆ బాలిక పేరు పూజా బిష్ణోయి. వయసు 11 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే అథ్లెట్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. కొత్త ఏడాది తాము ఫిట్ నెస్ సంపాదించుకోవడానికి ఆ బాలిక వీడియో స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.

ఆ బాలిక మట్టిలో చేతులు, కాళ్లు ఉంచి.. తన శరీరాన్ని పైకి, కిందికి లేపకుండా అడ్డంగా ఎడమ చేతి వైపునకు వేగంగా కదిలింది. పుషప్ పొజిషన్ లో ఆ బాలిక చేసిన ఈ వ్యాయామం ఆమె ఎంత ఫిట్ నెస్ గా ఉందో స్పష్టం చేస్తోంది. ‘‘నేనింకా వయసులో చిన్నదాన్నే’’ అని పేర్కొంటూ ఆమె ఈ ట్వీట్ చేసింది. ఆమెకు విరాట్ కోహ్లీ ఫౌండేషన్ సాయం చేస్తోంది.

ఐదేళ్ల వయసులోనే ఆమె సిక్స్ ప్యాక్స్ అబ్స్ సాధించింది. ఆసియాలో అంతచిన్న వయసులో ఆ ఘనత సాధించిన తొలి బాలికగా ఆమె రికార్డు సృష్టించింది. రన్నింగ్ లోనూ ఆమె గతంలో స్వర్ణ పతకం సాధించింది. ఆమెను అమృత్ మహోత్సవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. పూజా గతంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి వారితో ఫొటోలు దిగింది. ఒలింపిక్స్ లో పతకం సాధించాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది.

NBK108: అనిల్ రావిపూడి మూవీ సెట్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న బాలయ్య!