Jubilee Hills : చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ.. పోలీసుల అదుపులో బండ్ల గణేష్ కారు డ్రైవర్

రాత్రివేళ భోజనం సమయంలో చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో అదికాస్త విషాదానికి దారితీసింది. భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాధ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగింది.

Jubilee Hills : చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ.. పోలీసుల అదుపులో బండ్ల గణేష్ కారు డ్రైవర్

Crime news

Updated On : January 9, 2024 / 9:05 AM IST

Bandla Ganesh Car Driver : చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం విషాదానికి దారితీసింది. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ భార్యతో భర్త గొడవపడ్డాడు. సోమవారం ఉదయం అతడు విధులకు వెళ్లగా భార్య పలుమార్లు వీడియో కాల్స్ చేసింది. అతడు స్పందించకపోవడంతో ఫోన్ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ పెద్దగా కేకలు వేసింది. ఆ తరువాత బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలో సినీనిర్మాత బండ్ల గణేష్ కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : Yash : నా పుట్టిన రోజు మీద నాకు అసహ్యం వేస్తుంది.. అభిమానుల మృతితో యశ్ సంచలన వ్యాఖ్యలు..

రాత్రివేళ భోజనం సమయంలో చట్నీ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో అదికాస్త విషాదానికి దారితీసింది. భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాధ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోపతండాకు చెందిన రమణ.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 లోని ఇందిరానగర్ లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు.

Also Read : Bihar : కూతురుని ఇన్‌స్టా రీల్స్ చేయద్దన్నాడని అల్లుడిని చంపిన అత్తమామలు

ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్య చందనతో గొడవపడ్డాడు. సోమవారం ఉదయం అతడు విధులకు వెళ్లగా భార్య పలుమార్లు వీడియోకాల్స్ చేసింది. రమణ స్పందించకపోవడంతో.. ఫోన్ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ చందన పెద్దగా కేకలు వేసింది. తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్ చేసి త్వరగా తన ఇంటికి వెళ్లాలని కోరాడు. యజమాని ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా.. అప్పటికే చందన విగతజీవిగా మారింది. స్థానికుల సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటన స్థలికి చేరుకొని భర్త రమణను అదుపులోకి తీసుకున్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.