36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం: టూరిజం స్పాట్ గా ఎన్టీఆర్ పార్క్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఆవిష్కరించారు.

  • Published By: chvmurthy ,Published On : January 18, 2019 / 07:51 AM IST
36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం: టూరిజం స్పాట్ గా ఎన్టీఆర్ పార్క్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఆవిష్కరించారు.

సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్  విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. 50 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాం ఏర్పాటు చేసిన చెరువుకు తారకరామా సాగర్ గా పేరు మార్చారు. విగ్రహం ఆవిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల బోటులో విహరించారు. చెరువు పక్కనే ఉన్న 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కును, వావిలాల ఘాట్ ను కూడా చంద్రబాబు ప్రారంభించారు.  ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృధ్ది  చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.