APలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ ? 

APలో 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.

  • Published By: madhu ,Published On : April 12, 2019 / 02:08 AM IST
APలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ ? 

Updated On : April 12, 2019 / 2:08 AM IST

APలో 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.

APలో 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు చిత్తూరు మొదలు.. కర్నూలు వరకు ప్రతీచోట రక్తం నేల చిందింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహికి దిగాయి. ఘర్షణలో టీడీపీకి చెందిన ఒకరు, వైసీపీకి చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల ఈవీఎంలు ధ్వంసం కావడంతో.. రీ పోలింగ్ నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Read Also : టీడీపీదే విజయం, 130 స్థానాలు కైవసం : చంద్రబాబు జోస్యం

7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వాళ్లపై కేసు పెట్టినట్లు తెలిపారు. ఏపీలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌ జరిగే అవకాశముందన్నారు. ఎన్నికల సిబ్బంది పొరపాటుతో మాక్ పోల్ ఓట్లను తొలగించకుండానే పోలింగ్ ప్రారంభించారని అధికారులు ఈసీకి నివేదిక పంపారు. మాక్ పోల్‌లో నమోదైన ఓట్లను మినహాయించడమా? లేదా రీ పోలింగ్ నిర్వహించడమా అనే దానిపై ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం క్లారిటీ రానుంది. రాష్ట్రంలో పోలింగ్‌ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్టు ద్వివేది చెప్పారు.

ఏపీ వ్యాప్తంగా 25చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయని ద్వివేది తెలిపారు. పాక్షికంగా పోలింగ్‌ ఆగిన చోట అడ్జర్న్‌ పోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఫారం 17A పరిశీలించి రీపోలింగ్‌ చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే రీపోలింగ్‌ ఉంటుందని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో రీపోలింగ్‌కు అవకాశం ఉందని ద్వివేది చెప్పారు. 57 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. 
Read Also : మంగళగిరిలో ఉద్రిక్తత : ధర్నాకు దిగిన లోకేష్