ఏసీబీ అధికారుల మైండ్ బ్లాంక్ : అవినీతి @ 4 కోట్లు

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 03:22 AM IST
ఏసీబీ అధికారుల మైండ్ బ్లాంక్ : అవినీతి @ 4 కోట్లు

చేసేది ప్రభుత్వ ఉద్యోగం..అయినా డబ్బులు అధికంగా సంపాదించాలనే ఆశ. దీనితో కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏసీబీ పలు రైడ్స్ చేసి తనిఖీలు చేస్తున్నా ఆ అవినీతి ఉద్యోగుల్లో చలనం లేదు. బేఖాతర్ అంటున్నారు. రెండు చేతులా సంపాదిస్తూ..ఆస్తులను కూడబెడుతున్నారు. ఏసీబీ అధికారులు చేపడుతున్న సోదాలు..తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు…లక్షల విలువైన బంగారు ఆభరణాలు వెలుగు చూస్తున్నాయి. తనిఖీలు చేసే అధికారులకే మైండ్ బ్లాక్ అయిపోతోంది ఒక్కోసారి. తాజాగా ఏపీలో ఓ వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్ నివాసంపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. రూ. 4 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు తనిఖీల్లో బయటపడింది. ఐదు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారు. 

నాగేంద్ర ప్రసాద్ విషయానికి వస్తే…ఇతను కడప జిల్లా పెండ్లిమర్రి మండలం ఎల్లటూరు గ్రామ వాసి. 2018 డిసెంబర్ 7వ తేదీన ఓ హోటల్ యజమాని నుండి రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన నాగేంద్ర ప్రసాద్..బెయిల్‌పై బయటకు వచ్చారు. అక్రమాస్తులు భారీగా కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం ఆయన నివాసాలపై దాడులు చేశారు. కర్నూలులోని ఇంజనీర్స్ కాలనీ, కృష్ణా నగర్, అనంతపురం, తిరుపతి, హైదరాబాద్‌లలో తనిఖీలు చేపట్టారు. మొత్తంగా ఈ తనిఖీల్లో రూ. 4 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. 

> అనంతపురం బళ్లారీ రోడ్డులో 4.5 సెంట్లలో నిర్మించిన రూ. కోటి విలువైన డూప్లెక్స్ విల్లా. 
> రాజహంస అపార్ట్ మెంట్‌లో రూ. 40 లక్షలు విలువైన ఫ్లాట్
> కర్నూలు లక్ష్మీపురం సమీపంలో మయూరీ గ్రీన్ ల్యాండ్స్‌లో 40 లక్షలు విలువైన 4వేల చ.అ.స్థలం
> రూ. 7.10 లక్షల నగదు, రూ. 25వేల విలువైన 772 గ్రాముల బంగారు ఆభరణాలు. 
> రూ. 49 లక్షల విలువైన చెక్కులు, భార్య, పిల్లల పేరిట రూ. కోటికిపైగా విలువైన బీమా కాగితాలు