తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం: 8మంది పరిస్థితి విషమం

  • Published By: vamsi ,Published On : October 15, 2019 / 06:49 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం: 8మంది పరిస్థితి విషమం

Updated On : October 15, 2019 / 6:49 AM IST

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డులో టూర్‌కు వచ్చిన ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఘాట్‌ రోడ్డులో బస్సు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషమంగా ఉండగా ఇప్పటికే ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుె తెలుస్తుంది. గాయపడ్డవారిని కాపాడేందుకు సహాయ చర్యలు ప్రారంభించారు అధికారులు.

ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. టూరిస్టు బస్సు లోయలో పడడంతో ప్రమాదం సంభవించింది.