టీడీపీ నాయకుని ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు

ఇటీవల టీడీపీలో చేరిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబు ఇంట్లో పోలీసులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు సోదాలు చేశారు. చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల్లో పంచడానికి సీకేబాబు డబ్బును, మద్యంను తన ఇంట్లో ఉంచుకున్నాడని సీ విజిల్‌యాప్ ద్వారా ఫిర్యాదు రావడంతో ఒకటో పట్టణ సీఐ శ్రీధర్, ఎలక్షన్ స్క్వాడ్ అధికారి పార్థసారథితో పాటు పోలీసులు సీకే బాబు ఇంట్లో తనిఖీలు చేశారు. సుమారు అరగంటపాటు తనికీలు నిర్వహించిన పోలీసులు నగదు కానీ, ఇతర వస్తువులు కానీ కనిపించక పోవడంతో వెనుతిరిగారు.