సీఎం మారితే రాజధాని మారాలా? చరిత్రలో ఎక్కడా లేదు: కన్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అనే అంశంపై రాజధాని ప్రాంతంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు రాజధానుల అంశంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ తన వాదనలు వినిపిస్తుంది. లేటెస్ట్‌గా ఇదే అంశంపై రాజధాని రైతులకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు.
సీఎం మారితే రాజధాని మారడం చరిత్రలో ఎక్కడా జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అపరిపక్వతతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుందని కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రైతు సమస్య కాదని.. రాజధాని సమస్య అని కన్నా స్పష్టం చేశారు. తమ డిమాండ్ అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే అని.. పాలన వికేంద్రీకరణ కాదని అన్నారు కన్నా లక్ష్మీ నారాయణ. రాజధాని రైతుల ఆందోళనకు బీజేపీ నేతల సంఘీభావం ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.