కలిసొస్తుందా : బాబుకు ‘9’ సెంటిమెంట్

టీడీపీ అధినేత చంద్రబాబు నెంబర్ సెంటిమెంట్‌ను నమ్ముతున్నారా? అభ్యర్థుల సంఖ్యను ప్రకటించడంలో గులాబీ బాస్‌ను ఫాలో అవుతున్నారా? తొలి జాబితాలో 126 మందిని ప్రకటించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?.. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగడుగునా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ముహూర్తం చూడకుండా ఆయన ఒక్క పని కూడా చెయ్యడంలేదు. అమరావతి శంకుస్థాపన నుంచి ఇప్పటివరకు ఎన్నో సెంటిమెంట్లను ఆయన ఫాలో అయ్యారు. తాజాగా ఆయన తమ పార్టీ అభ్యర్థుల సంఖ్య విషయంలోనూ నెంబర్ సెంటిమెంట్ ఫాలో అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌ను ఎక్కువగా నమ్ముతుంటారు. ఏ పని మొదలు పెట్టినా ముహూర్తం..వాస్తు..ఇతరత్రా వాటిని చూసుకుని ముందుకెళుతుంటారు. ఇటీవలే పలు యాగాలు నిర్వహించారు కేసీఆర్.
Read Also: నెల్లూరు జిల్లా సిట్టింగ్‌లకు సీట్లు లేనట్లేనా? ఫస్ట్ లిస్ట్ ఇదే
బాబుకు నెంబర్ 9 తో బలమైన సెంటిమెంట్ ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 9 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌కు కూడా 9 సంఖ్య మీద ఎనలేని విశ్వాసం ఉండేది. ఏది చేయాలన్నా 9 సంఖ్య వచ్చేలా చూసుకుని ఆచరించేవారు. అదే సంఖ్య ఇప్పుడు బాబుకి కలిసి వస్తుందని ఆశ పడుతున్నారు. అందుకే 126 మంది అభ్యర్థులను ప్రకటించారు. 1+2+6=9 కాబట్టి తమకు కలసివస్తుందని ఆయన స్వయంగా ప్రకటించారు. మరి ఈ సెంటిమెంట్ బాబుకు కలిసి వస్తుందా ? లేదా ? అనేది చూడాలి.