ఆ జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ సవరించండి…సీఈసీకి ఏపీ సీఎం లేఖ

  • Published By: venkaiahnaidu ,Published On : May 1, 2019 / 01:15 PM IST
ఆ జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ సవరించండి…సీఈసీకి ఏపీ సీఎం లేఖ

Updated On : May 1, 2019 / 1:15 PM IST

ఫొని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సవరించాలని ఎలక్షన్ కమిసన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.తుఫాను ప్రభావం అధికంగా ఉండే తూర్పు గోదావరి,విజయనగరం,శ్రీకాకులం జిల్లాల్లో కోడ్ సడలించాలని,సహాయక చర్యలు తీసుకునేందుకు వీలుగా అనుమతివ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు సీఎం లేఖ రాశారు.ఈ రోజు రాత్రికి కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయం వెలువరించే అవకాశముంది.

అయితే తుఫాను కారణంగా స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంల భద్రతపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే తుఫాను వల్ల స్ట్రాంగ్ రూముల్లోని ఈవీఎంలకు ఎలాంటి ఇబ్బంది ఉందని ఏపీ సీఈవో ద్వివేది అన్నారు.
Also Read : ఫోని తుఫాన్ : ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు