సీఎం జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలని, ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి తన శుభాకాంక్షల సందేశంలో ఆకాంక్షించారు.