ప్లీజ్ డౌన్ లోడ్ : ఏపీ ఎంసెట్ హాల్ టిక్కెట్లు రెడీ
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఏపీ ఎంసెట్' పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు నేటి(ఏప్రిల్ 16) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఏపీ ఎంసెట్’ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు నేటి(ఏప్రిల్ 16) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘ఏపీ ఎంసెట్’ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు నేటి(ఏప్రిల్ 16) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘ఏపీ ఎంసెట్-2019’కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్ టిక్కెట్లు ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
ఏపీ ఎంసెట్-2019కి ఇప్పటి వరకు 2.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 1.96 లక్షల మంది, మెడికల్‌కి 87 వేల మంది అప్లై చేసుకున్నారు. రూ.10 వేల ఫైన్‌తో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 19వ తేదీ వరకు అవకాశం ఉంది. ఎంసెట్-ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష 7 సెషన్లు కాగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష 3 సెషన్లలో జరగనుంది.
Read Also : అప్లయ్ చేసుకోండి : అలహాబాద్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏప్రిల్ 20, 21, 22 తేదీల్లో 2 విడతలు, 23వ తేదీన ఉదయం ఒక విడత ఇంజనీరింగ్ వారికి పరిక్ష జరగనుంది. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షలు 23 మధ్యాహ్నం, 24వ తేదీన 2 విడతలు పరిక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్ల వెనుక భాగంలో పరీక్షకేంద్రం రూట్‌మ్యాప్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరిక్షకు అనుమతించరు.
ఇక ఎంసెట్ పరీక్షల రోజు ఎవరికైనా ఎన్‌డీఏ లేదా ఇతర పరీక్షలు ఉంటే వారికి మరో తేదీన పరిక్షను నిర్వహిస్తారు. అందుకోసం తగిన సర్టిఫికేట్ కాపీలను ఎంసెట్ మెయిల్ ఐడీకి పంపితే చాలు.