ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి.. 6సార్లు ఎమ్మెల్యేగా గెలుపు : కోడెల జీవిత విశేషాలు

  • Published By: madhu ,Published On : September 16, 2019 / 07:33 AM IST
ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి.. 6సార్లు ఎమ్మెల్యేగా గెలుపు : కోడెల జీవిత విశేషాలు

Updated On : September 16, 2019 / 7:33 AM IST

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు కన్నుమూశారు. కోడెల మృతి వార్త తెలిసి టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. కోడెల మృతిపై భిన్నమైన వార్తలు వస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బసవతారకం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. 1947 మే 2న గుంటూరు జిల్లా కండ్లకుంటలో లక్ష్మీ నర్సమ్మ, సంజీవయ్య దంపతులకు కోడెల జన్మించారు. ఈయనకు భార్య, కూతురు, ఇద్దరు కుమారులున్నారు.

పల్నాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా కోడెల ముద్ర వేసుకున్నారు. పల్నాడు పులిగా పేరు పొందారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో తొలిసారి నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా విన్ అయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఏపీ విభజన తర్వాత తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కోడెలను పల్నాటి పులిగా కార్యకర్తలు పిలిచేవారు. ఈయన వైద్య విద్యను అభ్యసించారు. డాక్టర్‌గా చిరకాలం వైద్యసేవలను అందించారు. ఎన్టీఆర్ హయాంలో హోంమంత్రిగా కోడెల బాధ్యతలు నిర్వహించారు. 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల క్రితం కోడెల చిన్న కుమారుడు మృతి చెందాడు. 

> గుంటూరు ఏసీ కాలేజీలో కోడెల విద్యాభ్యాసం.
> గుంటూరు మెడికల్ కాలేజీలో MBBS చేశారు. 
> కర్నూలు మెడికల్ కాలేజీలో MS చేశారు. 
> 1983లో ఎన్టీఆర్ పిలుపుతో కోడెల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 
> 1983లో టీడీపీలో చేరిక.
> 1983, 1985, 1989, 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. 
> 2019లో వైసీపీ నేత అంబటిపై కోడెల ఓడిపోయారు. 

> 1983, 85, 89, 94, 99 ఎన్నికల్లో వరుసగా గెలుపు
> నరసరావు పేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టారు
> విజయవాడ లయోలా కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీల్లో విద్యాభ్యాసం