ఏపీలో లాక్‌డౌన్ : అవసరమైతే తప్ప బైటకు రావద్దు..కొన్ని సేవలకు మినహాయింపు

  • Published By: chvmurthy ,Published On : March 23, 2020 / 10:43 AM IST
ఏపీలో లాక్‌డౌన్ : అవసరమైతే తప్ప బైటకు రావద్దు..కొన్ని సేవలకు మినహాయింపు

Updated On : March 23, 2020 / 10:43 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు  ప్రభుత్వం  రాష్ట్రంలో  ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. 

అదే సమయంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఆదుకునేందుకు ప్రతి ఇంటికి రూ.వెయ్యితోపాటు ఉచితంగా రేషన్, కిలో పప్పు సరఫరా చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణా వ్యవస్థను సైతం నిలిపివేసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

లాక్ డౌన్ నుంచి ఈ క్రింది సేవలకు మినహాయింపు ఇచ్చారు. 
> ఆహారం, సరుకులు, పాలు, పండ్లు, కూరగాయలు, చేపల రవాణా
> గిడ్డంగులు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, కళ్లజోళ్ల దుకాణాలు
> ఔషధ తయారీ వాటి రవాణా కార్యాలయాలు
> నిత్యావసర తయారీ యూనిట్లు, వాటి సరఫరా
> కరోనా నియంత్రణ కార్యాకలాపాల్లో పాల్గొనే ప్రైవేట్ సంస్థలు 
> పెట్రోల్ పంపులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్ ఏజెన్సీలు, వాటి రవాణా
> టెలికం, ఇంటర్నెట్ సేవలు
> పోలీసు, వైద్య, ఆరోగ్యం, పట్టణ, స్థానిక సంస్థలు..
> అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్, తాగునీరు, పురపాలక సేవలు..
> బ్యాంకులు, ఏటీఎంలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్‌ మీడియా
> ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలను ఈ కామర్స్‌ సైట్ ద్వారా పొందే అవకాశం 
> తప్పనిసరిగా ఉత్పత్తి , తయారు చేయాల్సిన సంస్థలు ఏమైనా ఉంటే వాటి మినహాయింపు కోసం కలెక్టర్ అనుమతి తీసుకోవాలి.

See Also | హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్.. బైక్ పై ఒకరికి, ఫోర్ వీలర్‌లో ఇద్దరికే అనుమతి