టీడీపీకి మరో షాక్ : వైసీపీలో చేరనున్న కారెం శివాజీ

  • Published By: veegamteam ,Published On : November 29, 2019 / 04:59 AM IST
టీడీపీకి మరో షాక్ : వైసీపీలో చేరనున్న కారెం శివాజీ

Updated On : November 29, 2019 / 4:59 AM IST

ఏపీ ఎస్సీ.. ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ వైసీపీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కాగా..కారేం శివాజీతోపాటు ఆయన సన్నిహితులు కూడా వైసీపీలో చేరనున్నారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్న హాయంలో కారెం శివాజీ ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ గా నియమితులు కావటంతో అనంతరం న్యాయపరమైన వివాదాలు వెంటాడాయి. న్యాయస్థానం కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ చైర్మన్ గా నియమించడాన్ని నియామకాన్ని తప్పు పట్టింది. ఆ తరువాత తిరిగి న్యాయ పరంగా పోరాటం కొనసాగిస్తూ..పదవిలో కొనసాగారు.  ఈ క్రమంలో ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయ్యారు. ఆ తరువాత  కూడా శివాజీ అదే పదవిలో కొనసాగారు. అనంతరం శివాజీ గురువారం తన పదవికి రిజైన్  చేసారు. వైసీపీలో చేరాలనే ఉద్ధేశ్యంతోనే కారెం రిజైన్ చేసినట్లుగా సమాచారం.

కారెం శివాజీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా..సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ నేతలతో కలిసి పనిచేశారు. ఆ తరువాత టీడీపీకి ఫేవర్ గా పనిచేశారు. దీంతో..ఆయనకు సీఎం అయిన చంద్రబాబు  కీలకమైన ఎస్సీ..ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. గతంలో పలుమార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పైన కారెం శివాజీ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన సన్నిహితులతో కలిసి సీఎం జగన్  సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.