మళ్లీ మళ్లీ చెబుతున్నా : ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

విజయవాడ : ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. విజయవాడలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 07:02 AM IST
మళ్లీ మళ్లీ చెబుతున్నా : ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

Updated On : March 31, 2019 / 7:02 AM IST

విజయవాడ : ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. విజయవాడలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా

విజయవాడ : ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చామన్నారు. విజయవాడలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని రాహుల్ చెప్పారు. తన ప్రసంగాన్ని స్పెషల్ స్టేటస్ అంశంతోనే ప్రారంభించారు. ఏపీకి హోదా ఇవ్వాలని అన్ని పార్టీలు కోరుతున్నాయన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఏపీకి దేశానికి మార్గదర్శకంగా తయారు చేశామన్నారు. 2019 తర్వాత పేదరికంపై సర్జికల్ స్ట్రయిక్స్ చేద్దామన్నారు.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ

ప్రధాని మోడీ విధానాలపై రాహుల్ మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. 2014లో మోడీ ప్రధాని అయ్యాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ తీసుకొచ్చి చిన్న వ్యాపారులను ఇబ్బంది పెట్టారని వాపోయారు. ఉపాధి హామీ పథకం, ఆహారభద్రత చట్టాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. రాఫెల్ డీల్ ద్వారా అనిల్ అంబానీకి వేల కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు. ఏపీకి ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కదాన్ని కూడా మోడీ నెరవేర్చలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం