రూ.25 కోట్ల లాటరీ తగిలిందని తెలిసి కూడా కూల్ గా..

  • Published By: nagamani ,Published On : August 27, 2020 / 05:19 PM IST
రూ.25 కోట్ల లాటరీ తగిలిందని తెలిసి కూడా కూల్ గా..

Updated On : August 27, 2020 / 5:47 PM IST

స్క్రాచ్ కార్డు గీకితే 10 రూపాయలు వచ్చినా ఏదో కోటి రూపాయలు లాటరీ తగిలింత సంతోష పడిపోతాం..ఎందుకంటే ఉచితంగా వచ్చే డబ్బుంటే అంత సంతోషం మరి..ఎవరికైనా సరే..అది ఎవరైనా సరే..కానీ ఓ అమ్మాయికి ఒకటీ రెండు లక్షలు కాదు ఒకటీ రెండూ కోట్లు కూడా కాదు ఏకంగా రూ.25 కోట్లకు పైగా లాటరీ తగిలిందని తెలిసి కూడా చాలా కూల్ గా కూర్చుంది. ఏంటీ ఈ అమ్మాయి ఎటువంటి స్పందనా లేని ‘రేసు గుర్రం సినిమా‘లో హీరోయిన్ స్పందనలాంటిందని అనుకుంటున్నారా? కానే కాదు..ఆమెకు కూడా చాలా సంతోషం వచ్చింది..కానీ కంట్రోల్ చేసుకుంది.

ఆస్ట్రేలియాలోని 20 సంవత్సరాల అమ్మాయి విద్యార్థిని క్యాజువల్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘‘సెట్ ఫర్ లైఫ్’’ అనే లాటరీ టిక్కెట్ ను కొంది. తరువాత రోజులాగే యూనివర్సిటీకి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజులు జరిగాయి..ఓ రోజు ప్రతీ రోజులాగానే యూనివర్శిటీకి వెళ్లింది..సీరియస్ గా క్లాస్ జరుగుతోంది. ఇంతలో ఆమె మొబైల్ ఓ మెసేజ్ వచ్చింది.

మెసేజ్ ఓపెన్ చేసి.. తన మెయిల్ చెక్ చేసుకుంది. అందులో తాను కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ పై రూ. 25,27,47,500 రూపాయలు గెలుచుకున్నట్లుగా మెయిల్ వచ్చింది. పట్టరాని సంతోషం వేసింది. ఎగిరి గంతేయాలనుకుంది. కానీ ఆమె అలా చేయలేదు. సైలెంట్ గా క్లాస్ వింటూనే ఉంది ఏమీ జరగనట్లుగా..తరువాత క్లాస్ అయిపోయాక తన సంతోషం పట్టలేని గట్టిగా కేకపెట్టింది..ఆనందంతో చిందులేసింది..

దీనిపై ఆమె మాట్లాడుతూ..నేను లాటరీ గెలిచిన విషయం తెలిసినప్పుడు ఆనందంతో ఎగిరి గంతేయాలని అనిపించిందని.. కానీ క్లాస్ నావల్ల డిస్ట్రబ్ కావటం నాకిష్టం లేదు..అందుకే సైలెంట్ గా ఉండిపోయనని చెప్పింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఈ విషయం బయట పెట్టింది. ఈ డబ్బుతో ఏం చేస్తావని అడిగితే మాకోసం ఓ ఒక ఇల్లు కొంటానని..ఇంకా ఇంటర్నేషన్ టూర్ వెళ్లాలని ఉందనీ.. ఎన్నో ప్రదేశాలు చూడాలని ఉంది..చెప్పుకొచ్చింది.