అతడి ఆటోనే 108 : పిలిస్తే చాలు.. ఆపదలో ఆదుకుంటాడు!
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణానికి చెందిన దానయ్య .. మానవతను చాటుకుంటున్నాడు.

శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణానికి చెందిన దానయ్య .. మానవతను చాటుకుంటున్నాడు.
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణానికి చెందిన దానయ్య మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. తన ఆటోను 108 వాహనంగా నడుపుతూ ఆపదలో ఉన్న గర్భిణీలు, వికలాంగులను ఆదుకుంటున్నాడు. ఆపద వచ్చినా, అత్యవసర పరిస్థితులు తలెత్తినా, రోజులో ఏ సమయంలోనైనా సంప్రదించాలంటూ ఆటోపై రాశాడు.
సురక్షితంగా, ఉచితంగా తీసుకెళ్తున్నాడు. ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రభుత్వ 108 సేవల కన్నా గ్రామంలో ఉన్న దానయ్యకు స్థానికులు ఎక్కువగా ఫోన్ చేస్తారు. ఎక్కడున్నా వెంటనే ఆటోతో వచ్చి బాధితులను ఆసుపత్రికి తరలిస్తుంటాడు.
ఎవరి వద్ద ఏమీ ఆశించకుండా.. నాలుగేళ్ళుగా ఉచితంగానే సేవలందిస్తున్నాడు. దానయ్య చేస్తున్న సేవలను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. అతను చేస్తున్న ఉచిత సేవలను పలువురు కొనియాడుతున్నారు.
Also Read : మంత్రి పదవి కోసం బెట్టు : అరికెపూడి గాంధీ అలక