తుమ్మల వర్గానికి చెక్ పెడుతున్న ఎమ్మెల్యే కందాల వర్గం

ఖమ్మం జిల్లా పాలేరులో మాజీ తుమ్మల నాగేశ్వర్ రావు వర్గానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గం చెక్ పెడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఉన్నవారికే బీఫామ్ ఇస్తున్నారు కందాల. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కందాల వర్గానికే బీఫారాలు ఇప్పించుకుంటున్నారు. మరోవైపు పార్టీలో ముందు నుంచి ఉన్న తమకు అన్యాయం జరుగుతుందని మరో వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తిరుమలాయపాలెంలో భారీగా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధమైంది. కేసీఆర్, కేటీఆర్ దగ్గరకు వెళ్లేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
Also Read : గుంతలో పడ్డ అంబులెన్స్ : లేచి కూర్చున్న పేషెంట్
కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించుకున్న కందాల ఉపేందర్ రెడ్డి..ఇప్పటికి వరకు పార్టీలో చేరలేదు. గులాబీ కండువా కప్పుకోలేదు. ఆయన అనధికారింగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. నాలుగు నెలలుగా టీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కందాల తన వర్గానికే బీఫారాలు ఇప్పించుకుంటున్నారు కానీ తుమ్మల వర్గంలోని ఒక్కరికి కూడా బీఫారమ్ ఇవ్వడం లేదు.
Also Read : అఖిలేష్ కౌంటర్ : సీఎం యోగికి ల్యాప్ టాప్ ఇస్తే.. 2 రోజులు వృథా