భూమా అఖిల భర్తపై కేసు నమోదు

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడని కంప్లయింట్ రావడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. క్రషర్ యజమాని శివరామిరెడ్డి ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు 307, 417, 427, 149 సెక్షన్ల కింద ఆళ్లగడ్డ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఆయనతో పాటు 10 మందిపై కేసులు రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది.
తనకు చెందిన క్రషర్‌లు ఇవ్వాలంటూ భార్గవ రామ్ వత్తిడి తెస్తున్నాడని, గతంలో అనేక సార్లు బెదిరింపులకు పాల్పడినట్లు శివ రామిరెడ్డి పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. అయితే..దీనిపై మాజీ మంత్రి భూమా, భార్గవ రామ్‌లు ఎక్కడా స్పందించలేదు.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేశారు. వైసీపీ నుంచి గంగుల తరపున గంగుల నాని బరిలో దిగారు. ఎన్నికల పోలింగ్‌లో అహోబిలంలో రణరంగం జరిగింది. టీడీపీ, వైసీపీ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు. ఇరు పార్టీల నేతలు కేసులు పెట్టుకున్నారు. ఈ కేసులో భూమా భర్త పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా వివాదంపై భూమా అఖిల ప్రియ ఎలా స్పందిస్తారో చూడాలి.