మేనిఫెస్టోలో కీలక అంశాలు చెప్పిన చంద్రబాబు
ఉగాది పర్వదినం నాడు మేనిఫెస్టోలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో సిద్ధం చేసింది.

ఉగాది పర్వదినం నాడు మేనిఫెస్టోలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో సిద్ధం చేసింది.
ఉగాది పర్వదినం నాడు మేనిఫెస్టోలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో సిద్ధం చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు గతంలో చేసినవి వివరించి రాబోయే రోజుల్లో చేసే పనులు గురించి మేనిఫెస్టోలో ఉన్న కొన్ని కీ పాయింట్లను చెప్పారు. మీ భవిష్యత్తు.. నా బాధ్యత పేరుతో మేనిఫెస్టోను తయారు చేసినట్లు చెప్పారు.
Read Also : బీజేపీ నేతలది రాజకీయ హిందుత్వం : కేటీఆర్
రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంకు, ముస్లింలకు ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ ప్రతి నెలా రూ.3వేలు, చంద్రన్న బీమా రూ.10 లక్షలు, వ్యవసాయానికి పగటి పూట 12 గంటల ఉచిత విద్యుత్తు, విదేశీ విద్యకు రూ.25 లక్షలు కేటాయిస్తామని చంద్రబాబు వెల్లడించారు.
ప్రచారానికి మూడు రోజులు, పోలింగ్‌కు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని గుర్తు చేసిన చంద్రబాబు.. పోలింగ్ ఏజెంట్లను జాగ్రత్తగా ఎంపిక చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ పార్టీపై ప్రత్యర్ధులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు.
Read Also : కాంగ్రెస్ గూటికి చేరిన బీజేపీ రెబల్ లీడర్