కేసీఆర్, మోడీ, జగన్‌లను బంగాళాఖాతంలో పడేస్తా – బాబు

ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీ సీఎం బాబు స్వరం మరింత పెంచారు. ఘాటు పదాలతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నారు. వైసీపీ, కేసీఆర్, మోడీలను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేసీఆర్, మోడీ, జగన్‌లను బంగాళాఖాతంలో పడేస్తానంటూ బాబు వ్యాఖ్యానించారు. టీడీపీ పార్టీని దెబ్బకొట్టేందుకు..ఏపీ రాష్ట్రంపై దొంగలంతా ఒక చేట చేరిపోవడంతో అది దొంగల పార్టీగా మారిపోయిందని వైసీపీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఏప్రిల్ 06వ తేదీన చీరాలలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని బాబు ప్రసంగించారు. ఈ రోడ్ షోకు భారీగా ప్రజలు హాజరయ్యారు.
ఎవరికి ఇబ్బందులు లేని సుపరిపాలన అందించాలని తపనతో తాను రాత్రి..పగలు కష్టపడినట్లు చెప్పుకొచ్చారు. పసుపు – కుంకుమ పథకానికి మూడో చెక్‌కు డబ్బులు బ్యాంకులో వేసినట్లు..ఏప్రిల్ 07వ తేదీన లబ్దిదారులు తీసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం ఈ పథకం అమలు చేసి తీరుతానన్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అంటే..వంద గిఫ్ట్‌లు పంపిస్తానని తాను పేర్కొనడం జరిగిందన్నారు. కేసీఆర్..జగన్..వీరి గురువు మోడీ..ముగ్గురిని కట్టి బంగాళాఖాతంలో పడేస్తానంటూ తెలిపారు.
కేసీఆర్ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పాడంట..జగన్ చెవిలో చెప్పి ఉండవచ్చునని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టపై కేసు ఎందుకు వేశారో సమాధానం చెప్పాలని కేసీఆర్‌ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఖబడ్డార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు బాబు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూంలు ఎక్కడున్నాయి ? 11 లక్షల గృహ ప్రవేశాలు చేశాం..చంద్రన్న బీమా కింద రూ. 10 లక్షలు అందిస్తామన్నారు. జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని..31 కేసులు పెట్టుకుని దాడి చేసేందుకు వస్తున్నాడని బాబు వెల్లడించారు.