పథకాలకు టీడీపీ మార్క్ పడలేదు.. ఆన్‌లైన్ చేయడంతో నష్టపోయాం

ప్రభుత్వ పథకాల అమలుకు ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి తేవడంతో టీడీపీ కొంతమేర నష్టపోయిందని ఆ పార్టీ నేతలు సమీక్షా సమావేశంలో చంద్రబాబుకు వెల్లడించారున. శుక్రవారం(10 మే 2019) హ్యాపీ రిసార్ట్స్‌లో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన చంద్రబాబు నేతల నుంచి ఎన్నికలు జరిగిన తీరు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా మాట్లాడిన నేతలు.. ఆన్‌లైన్ విధానంలో అందరికీ పథకాలు అప్లై చేసుకున్నవారికి అందుబాటులోకి రావడంతో పార్టీ నేతలకు, ప్రజలకు మధ్య అనుబందం తగ్గిపోయింది అని, ప్రభుత్వపథకాలకు టీడీపీ మార్క్ పడలేదని నేతలు వెల్లడించారు.
పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇచ్చేస్తున్నారు అని, అంతకు ముందు పార్టీ నేతల చొరవతో ఇవి వచ్చేవని, దానివల్ల పార్టీకి ప్రాధాన్యత ఉండేదని, ఇప్పడు అటువంటి పరిస్థితి లేదని చంద్రబాబుకు చెప్పారు. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు పార్టీ నేతలను పట్టించుకోట్లేదని, అర్హులం కాబట్టే లబ్ధి చేకూరిందని అంటున్నారని.. టీడీపీ ప్రభుత్వం వల్ల వచ్చిందని భావించట్లేదని అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇవి వచ్చేస్తాయనే అభిప్రాయం ఏర్పడడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుందని అన్నారు. ఈ సమిక్షాసమావేశంకు శ్రీకాకుళం లోక్‌సభ సీటు పరిధిలోని ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు పాల్గొన్నారు.