చిక్కినట్లే చిక్కి మాయం : ఆ గ్రామాల్లో చిరుత భయం

  • Published By: madhu ,Published On : February 14, 2019 / 07:21 AM IST
చిక్కినట్లే చిక్కి మాయం : ఆ గ్రామాల్లో చిరుత భయం

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండల వాసులకు ఓ చిరుత చుక్కలు చూపించింది. బలుసుల్లంకలో ఇద్దరిపై దాడికి పాల్పడడంతో అక్కడి జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దాడి చేస్తుందోమోనని గ్రామస్తులు తలో దిక్కు పారిపోయారు. అటూ ఇటు తిరిగిన చిరుత..ఓ గుడిసెలోకి వెళ్లింది. దీనిని గమనించి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చేసి తలుపు పెట్టేశారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. గుడిసెలో నక్కి ఉన్న చిరుతను బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అది బయటకు రాగానే మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ అది మాత్రం బయటకు రావడం లేదు. దీనిని బంధించి విశాఖపట్టణం జూ పార్కును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజుల క్రితం కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుతను పట్టుకొనేందుకు అధికారులు ప్రయత్నించి విఫలం చెందారు. మరి ఈ చిరుత చిక్కుతుందా ? లేదా ? చూడాలి.