పిలకాయలతో చంద్రబాబు  గోళీలాట

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 05:43 AM IST
పిలకాయలతో చంద్రబాబు  గోళీలాట

Updated On : January 11, 2019 / 5:43 AM IST

కందుకూరు  : బిజీ బిజీగా వుండే సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో కలిసి సరదా సరదాగా గోళీలాట ఆడారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చేసి, పైలాన్లను ఆవిష్కరించారు. కాగితపు పరిశ్రమకు సంబంధించి ఎంవోయూల మార్పిడి అనంతరం జన్మభూమి, మాఊరు పాల్గొన్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సంబరాలల్లో పాల్గొని పిల్లల ఆటల పోటీలను దగ్గరుండి పరిశీలించి.. గోలీలాట ఆడుతున్న పిల్లలను చూసిన ఆయన వాళ్లతో కాసేపు ఆడారు. సీఎంతో గోళీలాడంతో పిల్లలంతా మరింత ఉత్సాహంగా ఆడారు.  గోళీలాటతోపాటు కర్రా బిల్లా (చిర్రాగోనె), వాలీబాల్ ఆటలు, కోలాటం ఆడుతూ సరదాగా గడిపారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.