సీఎం రమేష్ ఇంట్లో సోదాలు: సీఎం సీరియస్
తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.

తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోట్లదుర్తిలోని సీఎం రమేష్ ఇంటిలోకి 50 మంది పోలీసులు ప్రవేశించి తనిఖీలు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కక్ష పూరితంగానే సీఎం రమేష్ ఇంటిపై పోలీసులతో సోదాలు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ఎస్పీ ఆదేశాల మేరకే సోదాలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పగా.. బెడ్‌రూమ్‌లోకి సైతం వస్తారా? అంటూ ప్రశ్నించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకే ఎన్నికల సంఘం కడప ఎస్పీని బదిలీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉదయం ఆరు గంటల సమయంలో సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Read Also : కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈసీ కీలుబొమ్మ : సీఎం రమేష్