ఇన్ చార్జ్ వ్యవస్థ రద్దు.. ఓడితే కార్యకర్తలే : బాబు సంచలన వ్యాఖ్యలు

  • Published By: vamsi ,Published On : March 30, 2019 / 05:53 AM IST
ఇన్ చార్జ్ వ్యవస్థ రద్దు.. ఓడితే కార్యకర్తలే : బాబు సంచలన వ్యాఖ్యలు

Updated On : March 30, 2019 / 5:53 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ దగ్గర పడుతుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విభజన హామీలు నెరవేర్చకుండా.. మోడీ తప్పుడు ఆరోపణలు చేసేందుకే రాష్ట్రానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. ప్రజలు ప్రతీ విషయాన్ని గమనిస్తున్నారని.. మోడీ మాటలు ఎవరూ నమ్మరని చెప్పుకొచ్చారాయన. మోడీ సభకు వైసీపీ కార్యకర్తలను భారీగా పంపించారని.. వారి కుట్రలను తిప్పికొట్టాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read Also : కారణం అదే : ప్రియాంక, నిక్ జోనస్ విడాకులు?

మరో 12రోజులు కష్టపడితే భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కీలకమైన సమయంలో అలసత్వం వద్దని హితవు పలికారు. అందరూ కలిసి ముందుకు పోవాలని దశనిర్దేశం చేశారు చంద్రబాబు. 

ఈ ఎన్నికల్లో ఓడితే ఇంతకుమందు మాదిరిగా ఇన్‌చార్జ్ వ్యవస్థలు కూడా ఉండవని.. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ ఎన్నికల్లో  ఓడితే సాధారణ కార్యకర్త అవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. అక్కడక్కడ కొంతమంది నేతలు నామ్‌కే వాస్తే గా ప్రచారం చేస్తున్నారని, వారంతా వెంటనే అలర్ట్ అవ్వాలని ఆదేశించారు. మరో 12రోజులు కష్టపడాలని సూచించారు.
Read Also : మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?