రాజధాని తరలింపుకు తొందరేమీలేదు : సీఎం జగన్
రాజధాని తరలింపుపై మంత్రులకు సీఎం జగన్ అరగంటపాటు వివరించారు. రాజధాని తరలింపుకు తొందరేమీ లేదన్నారు.

రాజధాని తరలింపుపై మంత్రులకు సీఎం జగన్ అరగంటపాటు వివరించారు. రాజధాని తరలింపుకు తొందరేమీ లేదన్నారు.
రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. రాజధాని తరలింపుపై మంత్రులకు సీఎం జగన్ అరగంటపాటు వివరించారు. రాజధాని తరలింపుకు తొందరేమీ లేదన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేమని సీఎం చెప్పారు. అమరావతిలో ఖర్చు చేసే 10 శాతం నిధులను విశాఖలో ఖర్చు పెడితే హైదరాబాద్ ను తలదన్నే రాజధాని అవుతుందన్నారు. అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి చేయలేమని చెప్పారు. రాజధానిని ఎందుకు మార్చాలో ప్రజలకు చెప్పి చేద్దామన్నారు.
రాజధాని తరలింపుపై ఏర్పాటు కానున్న హైపవర్ కమిటీ మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20 తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మూడు రాజధానుల నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రెండు గంటలపాటు సమావేశం సాగింది. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలు, చంద్రబాబు హయాంలోని 30 అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ చేపట్టింది. 4 నెలల విచారణ తర్వాత నివేదిక తయారు చేసింది. గత ప్రభుత్వ అక్రమాలపై సీఎం జగన్ కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అందజేసింది.
బోస్టన్ గ్రూప్ ఇచ్చిన మధ్యంతర నివేదికపై కేబినెట్ ల్ చర్చించారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ సర్వే నివేదికపై కేబినెట్ చర్చించింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రధానంగా ఏపీ రాజధానిని విశాఖపట్నంకు మార్చడంపైనే సమావేశంలో చర్చించారు.
కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని అంశం చర్చకు వచ్చిందని మంత్రి కన్నబాబు జీఎన్ రావు కమిటీ నివేదికపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. బోస్టన్ గ్రూప్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. రెండు నివేదికల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.