లాటరీలో లైసెన్స్ లు, ఫీజులు పెంపు : ఏపీలో కొత్త బార్ పాలసీ
ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి

ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి
ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం 798 బార్లు ఉన్నాయి. వాటిని 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
అలాగే ప్రస్తుతం ఉన్న బార్లను తీసేసి కొత్తగా లైసెన్సుల మంజూరు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. బార్ల లైసెన్స్ పీజు పెంచాలని, లాటరీ పద్ధతిలో లైసెన్స్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్యను కుదించారు. ఇప్పుడు బార్లపై ఫోకస్ పెట్టారు. వాటి సంఖ్య కూడా తగ్గించే పనిలో పడ్డాడు. అంతేకాదు బార్లలో మద్యం సరఫరా టైమింగ్స్ కుదించారు. బార్లలో మద్యం సరఫరా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఆహారం మాత్రం రా.11 గంటల వరకు సరఫరా చేసేందుకు పర్మిషన్ ఇస్తారు.
స్టార్ హోటళ్లలో మాత్రం ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మద్యం సరఫరా చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. నాటుసారా, కల్తీ మద్యం, మద్యం స్మగ్లింగ్ వంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.