తెలుగు రాష్ట్రాలలో యూపీ సీఎం పర్యటన

  • Published By: vamsi ,Published On : April 7, 2019 / 05:04 AM IST
తెలుగు రాష్ట్రాలలో యూపీ సీఎం పర్యటన

Updated On : April 7, 2019 / 5:04 AM IST

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖ బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్‌ తెలుగు రాష్ట్రాలలో ఇవాళ(7 ఏప్రిల్ 2019) పర్యటించబోతున్నారు. ఆదిత్యనాథ్‌ ఉదయం 12.30 గంటలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. యూపీ సీఎం రాకకోసం సభాస్థలితో పాటు సభా స్థలం పక్కన హెలిప్యాడ్‌‌ను కూడా ఏర్పాటు చేశారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో నిర్వహించే ఈ బహిరంగ సభకోసం బీజేపీ నేతలు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. తెలంగాణలో పర్యటన తర్వాత ఆదిత్యనాధ్ ఏపీకి వెళ్లనున్నారు. చిత్తూరులో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరబోతున్నారు.