అమరావతిని మార్చొద్దంటూ రైతులు, మహిళలు ఆందోళన
అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. నిరసనలు హోరెత్తుతున్నాయి. 144 సెక్షన్ విధించినప్పటికి రోడ్లపైకి వచ్చేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు.

అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. నిరసనలు హోరెత్తుతున్నాయి. 144 సెక్షన్ విధించినప్పటికి రోడ్లపైకి వచ్చేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు.
అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. నిరసనలు హోరెత్తుతున్నాయి. మందడం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 144 సెక్షన్ విధించినప్పటికి రోడ్లపైకి వచ్చేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో… తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆక్రోశానికి లోనైన మహిళలు… పోలీసులపై విరుచుకుపడ్డారు. మా భూములు తీసుకుని మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ… ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రశాంతంగా ఆందోళనలు చేసుకోనివ్వారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
రాజధానిపై ఏపీ కేబినెట్ ఏ నిర్ణయంపై తీసుకుంటోందనన్న ఉత్కంఠ ఓవైపు కొనసాగుతుంటే.. మరోవైపు రాజధాని గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరులోను రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్‌లో తమకు అనుకూల నిర్ణయం తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు.
ఆందోళనలతో అమరావతి అట్టుడుకుతోంది. 9రోజులపాటు శాంతియుతంగా నిరసనలు చేసిన ఆందోళనకారులు… పదో రోజు మాత్రం విధ్వంసాలకు దిగుతున్నారు. ఇవాళ ఉదయం ఓ యూనివర్సిటీ బస్సులు అద్దాలు పగలగొట్టిన ఆందోళనకారులు… ఉద్దండరాయునిపాలెంలో మరింత రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు.
తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ మీడియా ప్రతినిధులపై దాడి చేశారు ఆందోళనకారులు. మీడియా సిబ్బంది ప్రయాణిస్తున్న కారుపైనా అటాక్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. అయితే… ఆందోళనకారులు దాడి చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారు. అయినా వారు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పరిధిలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.