ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం నెలకొంది. 239 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లకు ఆహ్వానం పలికారు.

ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం నెలకొంది. 239 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లకు ఆహ్వానం పలికారు.
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం నెలకొంది. 239 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లకు ఆహ్వానం పలికారు. నేటి నుంచి 17 వరకు 80 ఎక్స్ ప్రెస్, 159 పల్లె వెలుగు బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని, ప్రైవేట్ బస్ ఓనర్లు బిడ్ లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.
అద్దె బస్సుల టెండర్లను ఆర్టీసీ ఈయూ నేతలు వ్యతిరేకిస్తున్నారు. విలీన ప్రక్రియ కొనసాగుతుండగా అద్దె బస్సులకు టెండర్లు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. అద్దె బస్సులను తేవడమంటే ఉద్యోగులను కుదించేందుకు జరిగే కుట్రేనని అన్నారు. అద్దె బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఆర్టీసీకి ఖర్చు పెరుగుందన్నారు.