వామ్మో చంపేస్తోంది : నిర్మల్ జిల్లా పంటపొలాల్లో మొసలి కలకలం

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 11:15 AM IST
వామ్మో చంపేస్తోంది : నిర్మల్ జిల్లా పంటపొలాల్లో మొసలి కలకలం

Updated On : March 20, 2019 / 11:15 AM IST

పంటపొలాల్లోకి మొసలి వచ్చిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం రేపింది. లక్ష్మణచాంద మండలం పారుపెల్లి శివారులోని పంటపొలాల్లో మొసలి ప్రత్యక్షమైంది. గుర్రపు డెక్క పేరుకుపోయిన ప్రదేశంలో ఆహారం కోసం వెళ్లిన కుక్కను.. మొసలి అమాంతం మింగేసింది. మంగళవారం(మార్చి 19) కూడా ఇలానే ఓ మేకను చంపేసింది. మొసలి కుక్కను మింగేస్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

జనసంచారం మధ్య కన్నెమ్మ చెరువులోకి భారీ మొసలి రావడం కలకలం రేపుతోంది. స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. మొసలిని వెంటనే బంధించి దూరంగా వదిలేయాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
Read Also : రంగు పడుద్ది : హోలీలో మహిళలను వేధిస్తే జైలే!