దీక్షల కోసం కోట్లు : బాబు పాలనపై దగ్గుబాటి విమర్శలు

  • Published By: madhu ,Published On : January 27, 2019 / 09:56 AM IST
దీక్షల కోసం కోట్లు : బాబు పాలనపై దగ్గుబాటి విమర్శలు

Updated On : January 27, 2019 / 9:56 AM IST

హైదరాబాద్ : దివంగత ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్రలు పోషించిన అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. గత కొంతకాలంగా పొలిటికల్‌గా దూరంగా ఉన్న దగ్గుబాటి ఇక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్‌తో..బీజేపీతో..టీడీపీతో కాదు…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో…దగ్గుబాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కన్ఫామ్ అయిపోయింది.

జనవరి 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు..ఆయన తనయుడు హితేశ్‌లు భేటీ అయ్యారు. హితేశ్…జగన్‌తో వెళుతారని దగ్గుబాటి భేటీ అనంతరం ప్రకటించారు. ఈ సందర్భంగా బాబు పాలనపై దగ్గుబాటి పలు విమర్శలు గుప్పించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పని తీరు గాడి తప్పిందని..ప్రభుత్వ డబ్బుతో దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దీక్షల కోసం కోట్లు ఖర్చు పెడుతుండడం హాస్యాస్పదమన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తున్నా…రైతు రుణమాఫీలకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. డ్వాక్రా మహిళలకు పోస్టు డెటేడ్ చేక్‌లిస్తామని ప్రభుత్వం చెబుతోందని…ఇలాంటి పాలన తాను ఊహించలేదని దగ్గుబాటి విమర్శించారు. పార్టీలో చేరిన తరువాత దగ్గుబాటి విమర్శకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. మరి దగ్గుబాటి చేసిన విమర్శలపై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.