Delhi : తలపై బుల్లెట్ గాయంతో కారులో శవం కలకలం..

  • Published By: nagamani ,Published On : November 11, 2020 / 04:32 PM IST
Delhi : తలపై బుల్లెట్ గాయంతో కారులో శవం కలకలం..

Updated On : November 11, 2020 / 4:41 PM IST

Delhi :  dead body in car : దేశ రాజ‌ధాని ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో ఓ కారులో కనిపించిన ఓ శ‌వం క‌ల‌క‌లం రేపింది. వెస్ట్ ఢిల్లీలోని చావ్లా ఏరియాలో ‌పార్క్ చేసి ఉన్న బుధవారం (నవంబర్ 11,2020) మధ్యాహ్నాం 12.30 గంటల సమయంలో స్విఫ్ట్ కారులో కారులో వ్య‌క్తి శ‌వాన్ని చూసి స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.



అనంతరం పరిసరాలను పరిశీలించారు. కారులో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా అతని త‌ల‌పై తుపాకీ తూటా గాయం ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్రం హాస్పిటల్ కు తర‌లించారు.


ఘ‌ట‌నా స్థ‌లంలో ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని.. అస‌లు అది హ‌త్యో, ఆత్మ‌హ‌త్యో తేలాల్సి ఉంద‌ని పోలీసులు చెప్పారు. త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌న్నారు.



కాగా మృతుడు ఉజ్వా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అలాగే కారు సత్బీర్ సింగ్ పేరుతో రిజిస్టర్ అయి ఉందని డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. మృతుడు సత్బీర్ సింగ్ కుమారుడనీ..అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.