ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 09:46 AM IST
ఏపీలో ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంద్రి ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
 

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య:
శ్రీకాకుళం 20,64,330
విజయనగరం 17,33,667
విశాఖ 32,80,028
తూ.గో. 40,13,770
ప.గో. 30,57,922
కృష్ణా 33,03,592
గుంటూరు 37,46,072
ప్రకాశం 24,95,383
నెల్లూరు 22,06,652
కడప 20,56,660
కర్నూలు 28,90,884
అనంత 30,58,909
చిత్తూరు 30,25,222