ప్రాణాలు తీసిన అతివేగం : కారు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం  

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 04:56 AM IST
ప్రాణాలు తీసిన అతివేగం : కారు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం  

Updated On : September 14, 2019 / 4:56 AM IST

చిత్తూరు జిల్లా మామడుగు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.  దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదురు సజీవదహనమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు జాహ్నవి, కళ,భానుతేజ, సాయి అశ్రిత, పవన్ రామ్ గా గుర్తించారు.

టీటీడీ ఉద్యోగి విష్ణు  భార్యా పిల్లలు..బంధువులతో కలిసి తిరుమల వెళ్లారు. అనంతరం తిరిగి బెంగళూరుకు  వస్తుండగా.. గంగవరం మండలం మామడుగు నేషనల్ హైవేపై వారు ప్రయాణిస్తున్న వోక్స్ వేగన్ కారు అదుపు తప్పింది. దీంతో బోల్తా పడటంతో కారులో చెలరేగిన మంటలకు ఐదుగురు సజీవంగా దహనమైపోయారు. ఈ ప్రమాదంలో విష్ణు మినహా భార్యా జాహ్నవి, కుమారుడు పవన్ రామ్, కుమార్తె అశ్రిత, సోదరి కళ, సోదరి  కుమారుడు భానుతేజ  మొత్తం ఐదుగురు మంటల్లో కాలిపోయారు. 
ఈ ప్రమాదం కారులో ఇంజన్లో చెలరేగిన మంటలకు  కారు పూర్తిగా దగ్థమైపోగా..మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కారులో మంటలు రావటంతో భయపడిపోయిన విష్ణు మాత్రం కారునుంచి దూకేయటంతో గాయాలు కాగా ప్రాణాలతో బైటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి గాయాలతో ఉన్న విష్ణును పలమనేరు ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.