టీడీపీ-బీజేపీ స్నేహం మళ్లీ చిగురిస్తోందా 

టీడీపీ-బీజేపీ మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తోందా... విశాఖ, నెల్లూరులో చంద్రబాబు చేసిన కామెంట్స్ దేనికి సంకేతం. సుజనా మధ్యవర్తిత్వం వెనక రీజనేంటి...?

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 03:08 AM IST
టీడీపీ-బీజేపీ స్నేహం మళ్లీ చిగురిస్తోందా 

Updated On : October 16, 2019 / 3:08 AM IST

టీడీపీ-బీజేపీ మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తోందా… విశాఖ, నెల్లూరులో చంద్రబాబు చేసిన కామెంట్స్ దేనికి సంకేతం. సుజనా మధ్యవర్తిత్వం వెనక రీజనేంటి…?

టీడీపీ-బీజేపీ మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తోందా… విశాఖ, నెల్లూరులో చంద్రబాబు చేసిన కామెంట్స్ దేనికి సంకేతం. సుజనా మధ్యవర్తిత్వం వెనక రీజనేంటి…? ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో పొలిటికల్ హీట్ మళ్లీ పెరుగుతోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో తిరుగుతూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. 

ఇటు బీజేపీ కూడా ప్రజల్లో ఉండేందుకు ఎక్కువగా ట్రై చేస్తోంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కేంద్రంతో విభేధించడం వల్ల రాష్ట్రానికి లాభం జరగలేదు… అదే టైంలో టీడీపీకి నష్టం జరిగిందంటూ ఆయన వైజాగ్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. లేటెస్ట్‌గా… నెల్లూరులోనూ ఆయన సేమ్ కామెంట్స్ చేశారు. మోడీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని.. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే మోడీపై పోరాడామంటూ కార్యకర్తల సమావేశంలో మనసులో మాట బయటపెట్టారు. 

ఇన్నాళ్లూ పార్టీ ఓటమిపై ఆయన పెద్దగా కామెంట్స్ చేయలేదు. ఓటమికి కారణాలు తెలియవు అంటూనే దాటవేశారు. కానీ.. విశాఖ, నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే… ఆయన పశ్చాత్తాప పడుతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామనే విషయం అర్థమై ఉంటుందని… అందుకే బీజేపీతో జతకట్టేందుకు ట్రై చేస్తున్నారంటూ పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి చాలా మంది సీనియర్లు కమలం గూటికి చేరిపోయారు. ఇంకా కొంతమంది అటు వైపు వెళ్లేందుకు స్కెచ్చులేసుకుంటున్నారు. ఈ పరిస్థితిల్లో బాబు కామెంట్స్.. నిజంగానే బీజేపీతో దోస్తీకి సిద్ధమనే సంకేతాలుగా భావించవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు.. జంపింగ్ జపాంగ్‌లకు చెక్ పెట్టేందుకే బాబు ఈ వ్యూహం పన్నుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. 

బాబు ఇచ్చే సంకేతాలెలా ఉన్నా… చంద్రబాబుకు డోర్స్ క్లోజ్ అంటూ ఇన్నాళ్లూ బీజేపీ అగ్రనేతలు హింట్ ఇచ్చారు. కానీ… రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మాత్రం సంచలనానికి తెరలేపారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగమేంటంటూనే… బీజేపీతో కలిసి పనిచేసేందుకు టీడీపీ ప్రతిపాదనతో వస్తే… అధిష్టానంతో మధ్యవర్తిత్వం జరిపేందుకు తాను సిద్ధమే అంటూ బాబుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు సుజనా. సుజనాచౌదరి మధ్యవర్తిత్వం మాట చెబితే… అసలు ప్రాంతీయ పార్టీలతో లాభం లేదంటూ బీజేపీతో కలిసిపోవాలంటూ పరోక్ష సంకేతాలిచ్చి బాబు మనసులోని మాటకు మద్దతిచ్చారు టీడీపీకీ చెందిన మరో సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి.

ఎన్నికల ముందు సాధారణ కార్యకర్త నుంచి ప్రధాని మోడీ వరకూ టీడీపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు బీజేపీ నేతలు. ఇప్పుడు అదే పార్టీతో జతకట్టాల్సిన అవసరం లేదనే అనుకుంటున్న టైంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ సుజనా చేసిన కామెంట్స్ దేనికి సంకేతమా అనే చర్చకు తెరలేపింది. బీజేపీతో దోస్తీ కట్టాలని చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టినా… సుజనా చౌదరి రాయబారం నడిపినా… ఇంతకీ బీజేపీ సైకిల్ పార్టీని చేరదీస్తుందా… ఎన్నికల సమయంలో ఏర్పడిన కలహాన్ని వీడి సయోధ్యకు సై అంటుందా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి నిజమవుతుందా అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్..