ప్రయాణికులకు సూచన : Goutami Express విజయవాడలో ఆగదు

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 03:03 AM IST
ప్రయాణికులకు సూచన : Goutami Express విజయవాడలో ఆగదు

Updated On : April 13, 2019 / 3:03 AM IST

లింగంపల్లి – కాకినాడ మధ్య నడిచే (12737/38) గౌతమి ఎక్స్ ప్రెస్ ఇక విజవాడలో ఆగదు. రాయనపాడు మీదుగా కాకినాడకు వెళ్లనుంది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం నుండి ఇది అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఎక్స్‌ప్రెస్ విజయవాడకు వెళ్లి..అక్కడి నుండి కాకినాడ వెళ్లేంది. అయితే..ఇంజిన్ మార్చాల్సి వచ్చేది. ఇలా చేయడం వల్ల రైలు ఆలస్యమవుతోంది. దీనికారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రాయనపాడు రైల్వేస్టేషన్‌ను డెవలప్ మెంట్ చేశారు. సరకు రవాణా కోసం ఇక్కడ ప్రత్యేక పార్సిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 

విజయవాడ రైల్వేస్టేషన్‌పై భారం తగ్గుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. విశాఖపట్టణానికి వెళ్లే ప్రతి రైలునూ రాయనపాడు మీదుగానే పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని, త్వరలో మరిన్ని రైళ్లను ప్రకటించడం జరుగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. లింగంపల్లి – కాకినాడ టౌన్ మధ్య నడిచే (12775/76) కాకినాడ ఎక్స్ ప్రెస్, నాందేడ్ – సంబల్ పూర్ ఎక్స్ ప్రెస్ (20809/10) వారంలో మూడుసార్లు..రైళ్లు విజయవాడకు వెళ్లకుండానే రాయనపాడు మీదుగా బైపాస్ లైన్ నుండి నేరుగా వెళ్లనున్నాయి.