పంచాయతీ సమరం : కరీంనగర్‌లో 45-50 శాతం పోలింగ్

కరీంనగర్ : గ్రామ వ్యవస్థలో గ్రామ ప్రథమ పౌరుడిని ఎన్నుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల్లోని 93 పంచాయతీలు, 728 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటల నుండి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పట్టణ స్థాయి నుండి గ్రామస్థాయికి ప్రజలు తరలిరావడంతో సందడి నెలకొంది. యువతీ, యువకులు ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉదయం నుండే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇక 113 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని అధికారులు గమనిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమై 11 గంటల వరకు 45 నుండి 50 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. గతంలో కంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
2,556 మంది అభ్యర్థులు.
ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్.
మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు.
వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక.
928 పోలింగ్ కేంద్రాలు