గుంటూరు జిల్లాలో 14సీట్లు ఖరారు: నారా లోకేష్ ఎంట్రీ.. రసవత్తరంగా రాజకీయం

  • Published By: vamsi ,Published On : March 15, 2019 / 04:04 AM IST
గుంటూరు జిల్లాలో 14సీట్లు ఖరారు: నారా లోకేష్ ఎంట్రీ.. రసవత్తరంగా రాజకీయం

ఎన్నికలు వస్తున్నవేళ ‘సైకిల్’ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలకుగాను 14నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా.. గుంటూరు తూర్పును ముస్లిం మైనార్టీ అభ్యర్ధి మహ్మద్‌ నసీర్‌కు ఇచ్చారు. అలాగే బాపట్ల ఎంపిగా ఉన్న శ్రీరాం మల్యాద్రిని తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించారు.
Read Also: నెల్లూరు జిల్లా సిట్టింగ్‌లకు సీట్లు లేనట్లేనా? ఫస్ట్ లిస్ట్‌ ఇదే

బాపట్ల, మాచర్ల, నరసరావుపేట అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి 12 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా ఎన్నికలకు ముందే ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు రావెల కిషోర్‌బాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీని వీడారు. ఇక ఈసారి జిల్లాలోని మంగళగిరి నుంచి తెలుగుదేశం యువనేత నారా లోకేష్ పోటీ చేస్తుండడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
బీసీలు -01
ఓసీలు- 09
ఎస్సీలు-03
మైనారిటీ -01

గుంటూరు జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:

పెదకూరపాడు – కొమ్మలపాటి శ్రీధర్ 
తాడికొండ – శ్రీరాం మల్యాద్రి
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌
వేమూరు – నక్కా ఆనంద బాబు 
రేపల్లె – అనగాని సత్యప్రసాద్‌
తెనాలి – ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌
ప్రత్తిపాడు(ఎస్సీ) – డొక్కా మాణిక్య ప్రసాద్
గుంటూరు(పశ్చిమ) – మద్దాల గిరి
గుంటూరు(తూర్పు) – మహ్మద్‌ నసీర్
చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు 
సత్తెనపల్లి – కోడెల శివప్రసాద్‌
వినుకొండ – జీవీ ఆంజనేయులు 
గురజాల – యరపతినేని శ్రీనివాస్ 

ఖరారు కాని స్థానాలు:
బాపట్ల 
నరసరావుపేట
మాచర్ల
Read Also: ప్రకాశం టీడీపీ రేసుగుర్రాలు వీళ్లే.. బాలకృష్ణ కారణంగా పూర్తిగా రాని క్లారిటీ!