నైట్ క్లాసులంటూ విద్యార్ధినులపై లైంగిక వేధింపులు: నంద్యాల స్కూల్లో వికృతచేష్టలు

కర్నూలు జిల్లా నంద్యాల నవచైతన్య స్కూల్లో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. లైంగికవేధింపులకు గురవుతున్నవిద్యార్దినులు ఎవరికి చెప్పుకోవాలో తెలీక..ఎలా చెప్పాలో తెలీక మౌనంగా హింసను అనుభవిస్తున్నారు.
విద్యార్ధినులకు నైట్ క్లాసులు పెట్టాలని నిర్ణయించి వారిపై స్కూల్ కరస్పాండెంట్ కుమారులు, కంప్యూటర్ టీచర్ కలిసి విద్యార్ధినులపై వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. తీవ్ర అసభ్య పదజాలంతో..విద్యార్ధినుల ప్రైవేటు భాగాలను స్కేల్ తో కొలుస్తూ లైంగికంగా వేధిస్తూ చిన్నారులను వేధిస్తున్నారు. దీంతో బాలికలు స్కూల్ కు వెళ్లలేక..తమపై జరుగుతున్న హింసను ఎవరికి చెప్పుకోలేక వారిలోవారే కుమిలిపోయారు. దీన్ని అలుసుగా తీసుకున్న సదరు వ్యక్తులు మరింతగా రెచ్చిపోయారు.తమ వేధింపులను కొనసాగించారు.
విద్యార్ధినులకు మాత్రమే నైట్ క్లాసులు నిర్వహిస్తు..వేధించటమ కాకుండా..రాత్రి సమయంలో స్కూల్ కు తప్పనిసరిగా రావాలని లేకుండా ఫెయిల్ చేస్తామని కరస్పాండటెండ్ కొడుకులు..కంప్యూటర్ టీచర్ యశ్వంత్, కార్తీక్, చరణ్ లు ముగ్గురు కలిసి వేధిస్తున్నారు. దీంతో విద్యార్ధినులు వారి వారి తల్లిదండ్రులకు చెప్పారు.
వేలకు వేలు ఫీజులు కట్టి..తమ పిల్లలను స్కూల్లో చదివిస్తుంటే వారిపై ఇటువంటి వేధింపులకు పాల్పడతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్