స్కూల్ చైర్ లోనే కుప్పకూలి హెడ్ మాస్టర్ మృతి

వాన రాకడ ప్రాణం పోకడ తెలీదంటారు పెద్దలు. వాన వస్తుందని అంచనా వేయొచ్చు. కానీ ప్రాణం ఏ క్షణాన పోతుందో మాత్రం చెప్పలేం. ఇటువంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండలం వెలకట్ట గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..విధుల్లో రోజులాగనే 56 ఏళ్ల హెడ్ మాస్టర్ విజయ్ సింగ్ స్కూల్ కు వెళ్లారు. తోటి టీచర్లు..విద్యార్ధులతో కలిసి లంచ్ స్కూల్లోనే చేస్తారు విజయ్ సింగ్. ఈ క్రమంలోనే లంచ్ భోజనం చేసేందుకు క్లాస్ రూమ్ నుంచి బైటకు వచ్చారు. మరో క్లాస్ రూమ్ లో ఉన్న తన లంచ్ బాక్స్ తెచ్చుకునేందుకు వెళ్లారు. కానీ ఎంతకూ బైటకు రాలేదు. దీంతో అంగన్వాడీ టీచర్ హెడ్ మాస్టర్ సార్ ని పిలుచుకు రండి అని విద్యార్థులను పంపించింది.
అలా పిలవటానికి వెళ్లిన విద్యార్ధులు కుర్చీలోనే కుప్ప కూలిపోయిన ఉన్న హడ్ మాస్టర్ కనిపించారు. మాస్టరు అలా ఉండటాన్ని చూసిన వారు రెస్ట్ తీసుకుంటున్నారేమో అనుకున్నారు. సార్..సార్ అంటూ పిలిచారు. కానీ ఎంతకీ పలకలేదు. మాస్టర్ సెల్ ఫోన్ పక్కనే పడిపోయి ఉండటం..మాస్టర్ కూర్చున్న తీరుతో అనుమానం వచ్చిన విద్యార్దులు వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి తోటి టీచర్లకు చెప్పారు.
వెంటనే వచ్చినవారు హెడ్ మాస్టర్ కుర్చీలో ఉన్న తీరుతో అనుమానం వచ్చి వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే విజయ్ సింగ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారని డాక్టర్ దవీకరించారు. విద్యార్ధులకు ఎంతో ఉత్సాహంగా పాఠాలు చెప్పే టీచర్ అలా చనిపోవటంతో విద్యార్ధులు..వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో యాక్టివ్ గా ఉండే తోటి టీచర్ స్కూల్లోనే అలా మృతి చెందటాన్ని చూసి తోటి టీచర్లు కన్నీరు మున్నీరుగా విలపించారు.