విశాఖలో కరోనా హైరిస్క్ జోన్లు ఇవే
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 8 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క విశాఖలోనే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 8 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క విశాఖలోనే
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు 8 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క విశాఖలోనే మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా విశాఖలో మూడు హైరిస్క్ జోన్లను ప్రభుత్వం గుర్తించింది. నగరంలోని సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మంగళవారం(మార్చి 24,2020) మీడియాతో మాట్లాడిన మంత్రి హైరిస్క్ జోన్ల పేర్లు చెప్పారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1470 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. అందరూ ఇంటికే పరిమితమైతే కరోనాను తరిమికొట్టవచ్చని ఆళ్ల నాని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
విదేశాల నుంచి అధికంగా వచ్చిన వాళ్లున్న ప్రాంతాలనే హైరిస్క్ జోన్లుగా ప్రకటించామని మంత్రి కన్నబాబు చెప్పారు. అలా అని ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ముప్పు ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు. ప్రతి 10 మంది విదేశీ ప్రయాణికులకు ఒక అధికారిని కేటాయించామన్నారు. ప్రతి పంచాయతీలోనూ కార్యదర్శులను ప్రత్యేకాధికారిగా నియమించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు కన్నబాబు వివరించారు. మూడో దశకు రాకముందే మనమంతా జాగ్రత్త పడాలన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా విశాఖలో 20 కమిటీలను ఏర్పాటు చేశామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారు అధికారులకు సహకరించాలని… లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుని క్వారంటైన్‌కు తరలిస్తామని మంత్రి తేల్చి చెప్పారు.
వార్డులు, క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఆళ్ల నాని చెప్పారు. కరోనా నివారణ చర్యలకు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశముందన్నారు. అయితే ఆ నిధులు వచ్చేంత వరకు ఎదురు చూడకుండా ముందుగానే జాగ్రత్తలు చేపట్టామని.. సీఎం జగన్ కూడా అందుకే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడంతో పాటు ఖర్చుల కోసం రూ.వెయ్యి నగదును అందజేయనున్నామని వివరించారు.