బాండ్ గర్ల్ : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటి డయానా రిగ్ కన్నుమూత

హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటి డయానా రిగ్ కన్నుమూశారు. హాలీవుడ్ సిరీస్ ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రపంచంవ్యాప్తంగా అత్యధిక మంది ప్రజలు చూసిన సిరీస్ లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’చాలా స్పెషల్. ఈ సిరీస్ లో నటించిన ప్రముఖ నటి డయానా రిగ్ క్యాన్సర్ తో పోరాడుతూ తన 82 ఏట కన్నుమూశారు.
https://10tv.in/polluted-air-linked-to-increase-in-blood-pressure-study/
గత ఆరు నెలల క్రితం క్యాన్సర్ బారిన పడ్డారు. అప్పటి నుంచి డయానా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. కానీ క్యాన్సర్ కు తోడు వృద్ధాప్యం కూడా కారణం కావటంతో ఆమె (సెప్టెంబర్ 10,2020)గురువారం మృతిచెందారు. డయానా తన కుటుంబసభ్యుల మధ్య ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడారని డయానా ప్రతినిధి సిమాన్ బేర్స్ ఫోర్డ్ వెల్లడించారు. డయానా మృతికి హాలీవుడ్ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు.
1960 దశకంలో అందాల నటిగా కుర్రకారును ఉర్రూతలూగించి.. బాండ్ గర్ల్ గా పేరు తెచ్చుకుని..ఆపై సీనియర్ నటిగా ‘అవెంజర్స్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి టెలివిజన్ సీరీస్ లోను..సినిమాలలోను నటించి..మెప్పించిన బ్రిటిష్ నటి డయానా రిగ్. ఉత్తమ నటిగా ఎన్నో అవార్డులను అందుకున్నారామె.