కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు ఉంటాయా
చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంటుందా ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.

చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంటుందా ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.
చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంటుందా ? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీ గురువారం జరుగనున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ గచ్చిబౌలిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో కొండా సందీప్ రెడ్డి కారులో రూ. 10 లక్షలు బయటపడ్డాయి. ల్యాప్ ట్యాప్‌లతో పాటు వివిధ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పత్రాల్లో ఎవరికి ఎంత డబ్బు ఇచ్చారో రాసుకున్నారు. ఇది ఒక కోడ్‌లోఉంది. దీనిని డీ కోడ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Also : సెలవులు, టూర్లు, ఎన్నికలు: అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..
కొండా సందీప్ రెడ్డి..కొండా విశ్వేశ్వరెడ్డికి ప్రధాన అనుచరుడు. అడ్వకేట్ అయిన ఇతను 2008 నుండి కొండా దగ్గర పనిచేస్తున్నారు. పట్టుబడిన డబ్బు కొండాకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల్లో నగదు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దీనితో ఈసీ చర్యలు తీసుకొనే ఛాన్స్‌లున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టాలనే దానిపై ఈసీ నిబంధనలున్నాయి.
దానికంటే ఎక్కువ ఖర్చు పెడితే అభ్యర్థులపై ఈసీ చర్యలు తీసుకొనే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే పట్టుబడిన కొండా సురేందర్ రెడ్డితో తనకు సంబంధం లేదని ఈసీ ఎదుట కొండా విశ్వేశ్వరెడ్డి చెప్పుకొస్తున్నట్లు తెలుస్తోంది. కొండా విషయానికి వస్తే..ఇతను టీఆర్ఎస్ పార్టీ నుండి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అనంతరం చేవెళ్ల నియోజకవర్గం నుండి ఎంపీగా బరిలో నిలిచారు. అత్యంత ధనిక పొలిటిషీయన్‌గా ఇతనున్నారు. రూ. 895 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
Read Also : తెలుసుకోండి : పోలింగ్ బూత్ లోకి వీటికి అనుమతి లేదు